నవాబుపేట,జూన్4: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి విడతలవారీగా సాయం అందజేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏక్మామిడి, మాదిరెడ్డిపల్లి, యెల్లకొండ, మైతాబ్ఖాన్ గూడ గ్రామాల్లో మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను, ఇంటి నిర్మాణానికి సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కల నేరవేరాలని ప్రభుత్వం ఐదు లక్షల రూపాయాలను సాయంగా అందజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసేటపుడు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని లేకపోతే బిల్లులు వచ్చేటపుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని గుర్తుజేశారు.