మర్పల్లి : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ గఫార్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో సిరిపురం ఎస్సీ హాస్టల్ వార్డెన్ తుల్జరం గౌడ్ ఆధ్వర్యంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
బాల్యవివాహల గురించి వివరస్తూ బాలికలకు 18 ఏండ్లలోపు వివాహాలు చేయరాదని, చేస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాల గురించి వివరించారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశం, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.