కందుకూరు : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని (Environment of plants ) కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy) పిలుపునిచ్చారు. కందకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రోజురోజుకు అడవులు అంతరించి పోవడం వల్ల వర్షాలు సకాలంలో కురియడం లేదని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్లకు ఇరువైపుల , ఖాళీ ప్రదేశాలతో పాటు, బాధ్యతగా మొక్కలను నాటాలని సూచించారు. మొక్కలు నాటడాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో పదేళ్ల పాటు మాజీ సీఎం కేసీఆర్ (KCR) గ్రామ గ్రామాన వననర్సరీలను ఏర్పాటు చేసి కోట్లాది మొక్కలను నాటే కార్యాక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారని గుర్తు చేశారు.
అమెజాన్ సంస్థ మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, కొత్తూరు గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ భవనాలను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హమీలను ఇచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీడీసీ సరిత, ఎంపీహెచ్వో విజయలక్ష్మీ , ప్రిన్సిపాల్, ఉమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.