కులకచర్ల, ఆగస్టు 1: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని వివిద గ్రామాల్లో ఫీవర్ సర్వే, లార్వ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ఉన్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామాల్లో ఫీవర్ సర్వే, లార్వ సర్వేను ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్అసీస్టెంట్లు ఇంటింటికి తిరిగి నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి రోజు 25 నుండి 50 ఇండ్లు తిరిగి సర్వే చేస్తున్నారని, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులు భారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ప్రస్తుతం ఒక కేసు నమోదు కావడం జరిగిందని పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.