దోమ : మొక్కలు నాటేందుకు సమయం సమీపిస్తున్న సందర్భంగా గ్రామాలలోని అన్ని నర్సరీలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో గ్యమ్య నాయక్ అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలోని నర్సరీని ఎంపీడీవో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలని అన్నారు. నర్సరీల నిర్వహణలో తగిన జాగ్రత్తలు పాటించి నాణ్యమైన మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.