Contractor | కొడంగల్, జూన్ 14: రేగడి మైలారం బాలప్ప, పర్సాపూర్ దోబ్బిలి ఇశ్వప్ప పట్టా పొలంలో అక్రమంగా దౌర్జన్యంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. తాండూర్ డీఎస్పీని సస్పెండ్ చేయాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేవీపీస్, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్సీ, ఎస్టి, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, అంబేద్కర్ సంఘం, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లొ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సా చంద్రయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య, కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం కొత్తూరు చంద్రయ్య,కొడంగల్ అంబేద్కర్ సంఘంయు.రమేష్ బాబు, డివిఎంసి మెంబెర్ దస్తప్పలు మాట్లాడుతూ.. బెల్కటూర్ గ్రామ నిందితులని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ,దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న దళిత ప్రజాసంఘాల నాయకులఫై అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటు అన్నారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత గ్రామం బెల్కటూరు దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం, దళితులు పెళ్లి చేసుకొని బారాత్ నిర్వహిస్తున్న సమయంలో అగ్రకులస్తులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే కుల వివక్ష అంటరానితనం, దళితులపై దాడులు జరగడం సిగ్గు చేటు అని ఇప్పటికైనా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చూశారు.
దళిత యువకుడు వినయ్ కుమార్ బరాత్ ఊరేగింపు అడ్డుకొని,
తాండూర్ మండలం, బెల్కటూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు వినయ్ కుమార్ మే నెల 18న వివాహం చేసుకొని అదే రోజు చేపట్టిన బరాత్ ఊరేగింపును అడ్డుకొని, దళితులపై దాడి చేసిన వారిని, దళిత పెళ్లి కుమారుని పెండ్లి బారాత్ ఊరేగింపును అడ్డుకొన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ప్రకారం,సమానత్వం, 17 ప్రకారం కువివక్ష నిషేద్దాం,
21 ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులను అగ్రకుల పెత్తందార్లు కాలరాస్తున్నా ప్రభుత్వం, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఘటన జరిగి 28 రోజులు గడుస్తున్నా నేటికి ఆ గ్రామాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సందర్శించకపోవడంపై అధికారులపై పలు అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆరోపించారు. ఆ గ్రామంలో దళితులకు నేటికీ దేవాలయ ప్రవేశం లేదు. ఆ గ్రామంలో కులవివక్ష, అంటరానితనం దళితులపై దాడులు, దౌర్జన్యం నిరంతరం కొనసాగుతున్నా ఆ దళితులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గం వర్గంలో దళితుల పంట పొలాల్లో అక్రమంగా రోడ్డు వేసి భయబ్రాంతులకు గురిచేసి బెదిరిస్తున్న అధికార పార్టీ నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆ గ్రామాన్ని వెంటనే సందర్శించి బాధితులను పరామర్శించి భరోసా కల్పించాలని కోరారు. నిందితులను అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయకపోతే కేవీపీఎస్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేఎన్పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మప్ప, డప్పు వెంకటయ్య కేవీపీస్ సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్