వికారాబాద్ : అంతు చిక్కని వ్యాధితో గత కొద్ది రోజులుగా కాకులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్నట్లుండి కాకులు పదుల సంఖ్యలో పడిపోయి చనిపోతున్నాయి.
అకస్మాత్తుగా కాకులు చనిపోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ విషయాన్ని పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లగా..పక్షులలో కలిషిత ఆహారం తినడం, లేదా విషపదార్థాలు తినడం వలన చనిపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు.