ధారూరు,మే 19 : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజా సమస్యపై వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చయిన అర్జీలను సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 119 దరఖాస్తులు రాగా రెవెన్యూ సమస్యలతో పాటు హౌసింగ్, డిపిఓ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డు, పశు సంవర్థక, డీఆర్డిఓ(పెన్షన్), పోలీస్ శాఖలకు చెందిన అర్జీలు ఉన్నాయి. ప్రజావాణిలో అదనపు జిల్లా కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.