వికారాబాద్, జూన్ 5 : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.
ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి సంతకాలు చేశారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్ డి ఓ వాసు చంద్ర,ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతి నిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.