కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) కోరారు. కందుకూరు గ్రామానికి చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై ఆసుసత్రిలో చేరారు. ఆసుపత్రి ఖర్చులు లేకపోవడం, స్థానిక ఎంపీటీసీని ఆశ్రయించడంతో ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముందస్తు చికిత్స కోసం ఆమె రూ. 1.50లక్షలను మంజూరు చేసి ఎల్ఓసీ లెటర్‌ను బాధితులకు అందజేశారు.
సబితా రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) పేదలకు వరంలాంటిదని చెప్పారు. డబ్బులను దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చికిత్స కోసం అందజేసే సీఎంఆర్ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్(BRS) పాలనలో లక్షలాది మంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఆదుకుందాని వెల్లడించారు.
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీటీసీల ఫోరంఅధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, మండల సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్‌రెడ్డి,బాలయ్య, బాధితులు పాల్గొన్నారు.