కులకచర్ల, జూలై 6: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం ముజాహిద్ పూర్ గ్రామంలో ఉప్పు హైమవతికి సంబంధించి ఇల్లుకు ముగ్గు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు మంజూరయ్యే విధంగా చూస్తామని తెలిపారు.
విడతల వారీగా ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయిస్తామని అన్నారు దాళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పైరవీలకు అవకాశం లేకుండా ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ చంద్రభూపాల్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.