బొంరాస్ పేట,జూన్ 15 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొంరాస్ పేట ఆవరణలో 1997-98 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి హరిలాల్, పూర్వ ఉపాధ్యాయులు సాయన్న గౌడ్, సాయిబన్న, చంద్ర శేఖర్ గౌడ్, వెంకట్రాములు గౌడ్, చెన్న బసప్ప, సాయప్ప పాల్గొన్నారు. ఉదయం పాఠశాల ఆవరణలో ఉన్న విగ్రహాలకు పూలమాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పూలుచల్లి వేదిక వరకు స్వాగతం పలికారు.
తమ పాఠాలు చెప్పిన గురువలను పూర్వ విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆపదలో ఉన్న తమ స్నేహితులకు సహాయ సహకారాలు అందించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, అశోక్ గౌడ్, తిరుపతయ్య, ఆలమయ్య నాయుడు, రాజేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.