కులకచర్ల, అక్టోబర్ 23 : విద్యార్థులకు అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను డీఈవో రేణుకాదేవి, డీటీడబ్ల్యూవో కమలాకర్రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు అన్ని విధాలుగా వసతులు సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు. అన్ని వసతులు సక్రమంగా ఉన్నప్పుడే విద్యార్థులు చక్కగా చదువుతారని పేర్కొన్నారు.
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంకేమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. డార్మెం టరీ, క్లస్మెంట్, కిచన్ వంటి వాటిలో ఏమైన రిపేర్లు ఉంటే ఫైల్ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కేజీబీవీ పాఠశాల ఎస్వో దేవి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం కులకచర్ల కేవీఎం పాఠశాలను సందర్శించిన వారు పాఠశాలలో విద్యార్థుల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో అబీబ్హైమద్, పాఠశాల కరస్పాండెంట్ కరణం ప్రహ్లాద్‌రావు పాల్గొన్నారు.