కొడంగల్,జులై 03 : ఎలాంటి తప్పులు లేకుండా ఉండే విధంగా ఓటర్ల జాబితాను సవరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ముందు ఉంచుకొని వాటిని క్షుణంగా పరిశీలించి ఏదైనా తప్పులు ఉంటే సవరించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. బిఎల్ఓలు తమ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి జాబితాలో తప్పులు లేకుండా సరిదిద్దాలని ఆదేశించారు.
ఓటరు జాబితాలో తప్పు ఒప్పులు ఉన్న మార్పులు చేర్పులు ఉన్న, మరణించిన వారి పేర్లను తొలగించాల్సి ఉన్న వాటిని సరిచూసుకొని ఓటరు జాబితాను సవరించుకోవాలని సూచించారు. సరళమైన ఓటరు జాబితా అందుబాటులో ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని సూచించారు. ఓటరు జాబితా సరి చేసుకోవడంలో బిఎల్వోలు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొడంగల్ తాసిల్దార్ విజయకుమార్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ అనిత, ఏఎల్ఎమ్టీలు అబ్దుల్ హక్, క్రాంతి కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.