వికారాబాద్, జూన్ 3: పెన్షన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రైతు ఆత్మహత్య కుటుంబాలు, వితంతు పెన్షన్ ప్రతిపాదనలు తదితర అంశాలపై సెర్ఫ్ సీఈవో దివ్య రంగరాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు, డీఆర్డీవో, రెవెన్యూ భాగాల సంబంధించిన అధికారులతో జూమ్ సమావేశం ద్వారా పలు సూచనలు చేశారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సహాయం పొందే విధంగా దరఖాస్తుల స్వీకరించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం నుండి పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో వెంకటేశ్వరి, నేమత్ అలీ, మహమూద్ అలీ, నర్సింలు పాల్గొన్నారు.