వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెల మందను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మందలోని గొర్రెల పైనుంచి వాహనం దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో మొత్తం 70 గొర్రెలు మృతిచెందాయి. దాంతో ఆ గొర్రెల యజమానులు ఎల్లప్ప, మల్కప్ప లబోదిబోమని రోదిస్తున్నారు. తమకు లక్షల్లో నష్టం జరిగిందని గుండెలు బాదుకున్నారు.