e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home రంగారెడ్డి Vikarabad : తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. పూల పండుగ

Vikarabad : తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. పూల పండుగ

వికారాబాద్‌ : వికారాబాద్‌ పట్టణంలోని బ్లాక్‌గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు జిల్లాస్థాయి మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి, భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. బతుకమ్మ సంబురాలు చివరి రోజు కావడంతో మహిళలు అధిక సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆడి పాడారు. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌, జిల్లా కలెక్టర్‌ నిఖీల, ఎమ్మెల్యే డాక్టర్‌ సబితానంద్‌ దంపతులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, డీడబ్ల్యూవో లలితకుమారిలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు ఆడుతున్న బతుకమ్మ ఆట, పాటల్లో కలిసి సంబురాలు చేసుకున్నారు.

- Advertisement -

పెద్ద ఎత్తున బతుకమ్మ సబురాల్లో చిన్నారులు, మహిళలు పాల్గొనడంతో ప్రాంగణం అంత పండగ వాతావరణంలా మారింది. సంబురాలను చూసేందుకు వికారాబాద్‌ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలువురు బతుకమ్మల ముందు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వికారాబాద్‌ పట్టణంలోని విశ్వభారతీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను విద్యార్థినులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాలకు వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల హాజరై విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ ఆటలు ఆడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సురేష్‌, పుష్పలత రెడ్డి, సాయిరాం ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణగౌడ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి, కరెస్పాండెంట్‌ బస్వరాజ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement