పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని టీచర్స్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో చోరీకి గురైన హుండీ పరిగి పోలీసులకు మంగళవారం లభించింది. గుర్తు తెలియని దుండగులు హనుమాన్ దేవాలయంలో హుండీని దొంగలించి పరిగి శివారులోని హైవే సమీపంలో పడేశారు. రోడ్డు ప్రక్కన వెళ్తున్న ప్రయాణీకులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని హుండీని స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా టీచర్స్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని హుండీగా నిర్దారించారు.
అనంతరం హుండీని తీసుకెళ్లి ఆలయ నిర్వాహకులకు అప్పగించి ఆలయంలో యదా స్థానంలో ఏర్పాటు చేశారు. హుండీ చోరీ విషయమై ఎస్సై విఠల్రెడ్డిని వివరణ కోరగా తమకు హుండీ చోరీకి గురైనట్లు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుండీని పరిశీలించగా హనుమాన్ దేవాలయానికి చెందినదిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.