వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంతపద్మనాభస్వామిని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్ ఐఏఎస్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన శశాంక్‌కు ఆలయ ఫౌండర్ మెంబర్ ఎన్. పద్మనాభం ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. వారి వెంట జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా అధికారి కోటాజీ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నట్లు ఆలయ ఈవో నరేందర్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు.