బొంరాస్ పేట : మండలంలోని నీల్యానాయక్తండాకు చెందిన రాథోడ్ లక్ష్మీబాయికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో చెక్కును అందజేశారు. లక్ష్మీబాయి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతుంది. ఆమెకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 1లక్ష ఆర్థిక సహాయం ప్రభుత్వం మంజూరు చేసింది. మంజురైన ఎల్వోసిని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.