కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మొద్దు
కాంగ్రెసోళ్లు చెబుతున్న దొంగ హామీలను ప్రజలు నమ్మవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండలంలోని బీరోల్, జిన్నారం, ఎన్కెపల్లి, రాంపూర్, ఎన్నారం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
కోట్‌పల్లి, అక్టోబర్ 19: కాంగ్రెసోళ్లు చెబుతున్న దొంగ హామీలను ప్రజలు నమ్మవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండలంలోని బీరోల్, జిన్నారం, ఎన్కెపల్లి, రాంపూర్, ఎన్నారం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెసోళ్లకు ప్రజల అభివృద్ధి సంక్షేమంపై శ్రద్ధ లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ కాలంలొనే ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అందించిందన్నారు.

కొత్త మ్యానిఫెస్టోను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాదేవి, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వికారాబాద్, అక్టోబర్ 18 : బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నాయని ఎమ్మెల్యే ఆనంద్ సతీమణి డాక్టర్ సబిత తెలిపారు. గురువారం వికా రాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి, గుడుపల్లి, సుభాష్‌నగర్ కాలనీల్లో ప్రచారం చేశారు. మహిళలను ఆప్యాయంగా పలుకరించి, బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆమె వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్లు గోపాల్, సంతోష, ప్రవళిక, పావని, అనంత్‌రెడ్డి, కృష్ణ, కృష్ణారెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, అనంత్‌రెడ్డి, మల్లేశం, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

