పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాల ప్రహారీగోడ శిథిలావస్థకు చేరిందని కొత్తగా ప్రహరీ నిర్మించాలని ప్రధాపాధ్యాయుడు క్రిష్ణారెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లాక్డౌన్ తర్వాత ప్రత్యక్ష తరగతి బోధనకు విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు.
కార్యక్రమంలో పరిగి, చేవేళ్ల ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే సోదరుడు అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.