పరిగి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తమ నివాసంలో దోమ మండలం బొంపల్లి ఎంపీటీసీ, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు రాఘవాపూర్ రాములు, మాజీ సర్పంచ్ మాన్యానాయక్, మాజీ ఉపసర్పంచ్ శంకర్‌నాయక్, నాయకులు రంజానాయక్, దేవులానాయక్లు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఏ ఎన్నికలైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు.
ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు సబ్బండ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు హరిశ్చందర్, డాక్యనాయక్, ఖాజపాష, రఫిక్, షేర్‌ఖాన్, బొంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్రం వెంకటయ్య పాల్గొన్నారు.