బొంరాస్పేట : 2022-2023 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశానికి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల విద్యాధికారి రాంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తేదీ 01.05.2009 – 30.04.2013 మధ్యలో జన్మించి ఉండాలని, మూడో తరగతి నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతు ఉండాలని తెలిపారు. నిర్ణీత దరఖాస్తు ఫారంలో వివరాలు నింపి అభ్యర్థి ఫొటో, సంతకం, తండ్రి సంతకాలను చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎంఈఓ సూచించారు.