నవాబుపేట : యోగ చేయడం వల్లన కలిగే ప్రయోజనాలను నవాబుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మైసూర్ నుంచి కాశికి వేలుతున్న యోగ గురువు కృష్ణనాయక్ విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూర్ నుంచి కాశికి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మంగళవారం మార్గమధ్యలో నవాబుపేట పాఠశాల కనిపించడంతో హెచ్ఎం సాకారం తీసుకుని విద్యార్థులకు యోగాసానాలు, దాని వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగ గురువు కృష్ణనాయక్ మాట్లాడుతూ యోగ చేయడం వలన మనిషి శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటునే ఎలాంటి రోగాల భారీన పడకుండా ఉంటాడని అందుకే ప్రతీ రోజు ఉదయం, సాయం కాలం సమయంలో తప్పనిసరిగా యోగా చేయాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం పాఠశాల హెచ్ఎం పాండు మాట్లాడుతూ.. మన రోజువారీ అలవాట్లలో భాగంగానే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుని సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. మంచికోసం చేసే ఏ పనినైనా ఓపికతో చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, లక్ష్మి, శశిధర్, వెంకటయ్య, మాణెమ్మ, రమాదేవి, పరమేశ్వర్, మౌనిక, నిర్మల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.