వికారాబాద్, సెప్టెంబర్ 9 : ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు జయంతిని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీవో వాసుచంద్రలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక సమస్యలపై నిర్మోహమాటం గా, నిక్కచ్చిగా స్పందించే వ్యక్తిత్వం కాళోజీది అని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ కవుల్లో కాళోజీ ఒక రన్నారు. సాహితీరంగంలో ఆయన చేసిన కృషి మ రువలేనిదన్నారు.
సామాజిక కార్యకర్తలు బందప్ప నర్సప్పగౌడ్, సంగీతపు రాజలింగం పాల్గొని కాళో జీ జీవనశైలి, కవిత్వంలో ఆయన వాడిన పదజాలంపై కవితా సంపుటితో వివరించారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీవైఎస్వో హనుమంతరావు, బీసీ, ఎస్సీ అభివృద్ధి శాఖల అధికారులు ఉపేందర్, మల్లేశం , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.