షాబాద్ : గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తండాకు చెందిన గిరిజనులు బోకేలు అందజేసి మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో అభిమానంతో తన ఇంటికి వచ్చిన మహిళలందరితో అప్యాయంగా మాట్లాడి, ఫొటోలు దిగి నేనున్నానని భరోసా నిచ్చారు. మీ ఆత్మీయ పలకరింపు మాకు కొండంత అండ అంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తండాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఏ సమస్య ఉన్న తీరుస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.