కోట్పల్లి : మండలంలోని నాగసాన్పల్లి గ్రామ సమీపంలో 13 సంవత్సరాల క్రితం నుంచి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రశాంత వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడిందని పవన్ అన్నారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ 13వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగ గురువు శుభాష్ చత్రీజీ, వికారాబాద్ ఎమ్మెల్యె డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యె మాట్లాడుతూ మనిషి ఆరోగ్యం, ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతో అవసరమని, నాగసాన్పల్లి సమీపంలోని అటవీ ప్రాంతలో ప్రశాంతమై వాతావరణంలో ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజలకు మంచి శుభపరినామం అన్నారు.
ఇక్కడికీ సుదూర ప్రాంతాల నుంచి విజిటర్స్ వచ్చి ఇక్కడి వాతావరణంలో గడిపి వెల్లడం ఇక్కడి వాతవరణ పుణ్యమని అన్నారు. కార్యక్రమంలో క్వాంటమ్ లైప్ యూనివర్సిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.