దౌల్తాబాద్, నవంబర్ 23 : మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని వికారా బాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని మాటూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
భోజనం నాణ్యతగా లేకుంటే ఏజెన్సీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బడి సరిపడా వసతులు ఉన్నాయా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ నర్సింహారెడ్డి, హెచ్ఎం భీమేశ్, పంచాయతీ కార్యదర్శి మల్లప్ప, ఉపాధ్యాయులు అశోక్, వెంకటేశ్ తదితరులున్నారు.