షాద్నగర్టౌన్, నవంబర్ 21: బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని షాద్నగర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కమ్మదనం గురుకుల పాఠశాలలో శుక్రవారం బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లలను సంరక్షించుకోవాలిసన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
బాల్య వివాహాలను అరికట్టే విధంగా అందరూ కృషి చేయాలన్నారు.
అదే విధంగా మాదకద్రవ్యాలతో కలిగే దుష్ప్రభాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు, ప్రగతి ఎన్జీవో సభ్యులు ప్రగతి, తులసీ, డీసీపీయూ సభ్యులు శ్రీలత, గీత, ఏఎన్ఎం మల్లిక, అంగన్వాడీ ఉపాధ్యాయులు సాబేరా, వీరమణి, కొమురమ్మ, అస్వీయ, సుమతమ్మ పాల్గొన్నారు.