బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- ఎంపీపీ కృపేశ్
- బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా జోరుగా ప్రచారం
- పాల్గొన్న పార్టీ శ్రేణులు
ఇబ్రహీంపట్నంరూరల్, మే 4 : బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, గ్రామశాఖ అధ్యక్షుడు దానయ్యగౌడ్, నాయకులు అంజయ్య, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, చందు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
నందివనపర్తిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

యాచారం : లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని నందివనపర్తి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్యామ మల్లేశ్ కూతురు ఆరోని స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ముందుగా గ్రామంలోని అతి పురాతనమైన నందీశ్వరాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఆడపడుచులకు బొట్టు పెడుతూ ఓటు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కొండాపురం శ్రీశైలం, అనంతం, జహంగీర్ తదితరులన్నారు.
క్యామ మల్లేశ్‌ను గెలిపించాలి
అబ్దుల్లాపూర్‌మెట్ : భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని క్యామ ఆరోని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో మండల నాయకులతో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పని చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే గ్రామంలోని దుకాణాలు, ఇంటింటికీ తిరిగి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యామ మల్లేశ్‌ను భువనగిరి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపిస్తారన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కిషన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, రంగయ్య, నాయకులు వెంకటేశ్‌గౌడ్, యాదగిరి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, నర్సింహ, జంగమయ్య, శ్రీశైలం ఉన్నారు.
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
మంచాల : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నా రు. ఆగపల్లి, కాగజ్‌ఘట్, జాపాల, రంగాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లారెడ్డి, భిక్షపతి, అమరేందర్‌రెడ్డి, శ్రీశైలం, చందు, రాంరెడ్డి, లక్ష్మణ్, శ్రీరాములు, నాగరాజు, పద్మారెడ్డి, వీరేశం, దిలీప్‌రెడ్డి, విజయ్‌కుమార్, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

