షాద్నగర్టౌన్, జూన్ 15: అర్హులందరికి ఇందిర్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్నగర్ పట్టణంలోని యూనివర్సల్ మినీ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా 12వ మహాసభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భూమిలేని పేదలకు సంవత్సరానికి రూ. 12వేలు ఇవ్వాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు రైతు బంధు రైతుల ఖాతలో వేయాలన్నారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 29లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ప్రజా పంపిణీ ద్వారా ఉచితంగా 14రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మహాసభ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అంజయ్య, కార్యదర్శిగా జగన్, ఉపాధ్యక్షులుగా శ్రీనునాయక్, అంజయ్య, శివ, సహాయ కార్యదర్శిగా జంగయ్య, శ్యాంసుందర్, సభ్యులు జంగయ్య, అజయ్, బయాదయ్య, గణేశ్, జగన్, పుష్ప, సత్యం, ఆంజనేయులు, రవి, నరసింహ్మ, సైదమ్మ, అంబేద్కర్, దేవయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామచందర్, రాజు, ఈశ్వర్నాయక్, శ్రీనివాస్, ఆవాజ్, మహమ్మద్, బాబు, రాజు, కురుమయ్య పాల్గొన్నారు.