Venkateswara Swamy Temple | కేశంపేట, ఫిబ్రవరి 13 : వార్షిక బ్రహ్మోత్సవాలకు దవళగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 14న పంచామృతాభిషేకం, రాత్రి కుమార్చన, 15న ధ్వజారోహణ, గరుడ సేవ, భగవత్నామ సంకీర్తన, 16న వేంకటేశ్వరస్వామి అలంకరణ, 17న స్వామివారి కల్యాణం, సహస్రనామార్చన, రాత్రికి భజన పోటీలు, 18న పూర్ణాహుతి, బండ్లు తిరుగుట, 19న పట్టాభిషేకం, చక్రతీర్థం, మహాపూర్ణాహుతి, 20న బండ్ల పోటీలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భజన పోటీలు, బండ్లు లాగుట కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.