ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి ఆలయాలతో పాటు పాఠశాలల్లో చదువులమ్మకు ప్రత్యేక పూజలు చేసి, చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
షాద్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 5 : షాద్‌నగర్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శనివారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చిన్నారులచే అక్షరాలను దిద్దించారు.
మొయినాబాద్ : షాబాద్ మండలంలోని సరస్వతి శిశుమందిరంలో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. సరస్వతి శిశుమందిరంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికే కృషి చేస్తున్నామని సరస్వతి విద్యాపీఠం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రవీంద్రశర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో సరస్వతి శిశుమందిరం షాబాద్ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, గడ్డం రమేశ్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : వసంత పంచమిని పురస్కరించుకుని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట అంబా భవానీమాత దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస్యం చేయించారు. ఉదయం నుంచి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
కడ్తాల్ : అన్మాస్‌పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలో వసంత పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో సరస్వతీదేవి విగ్రహం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహం ఎదుట చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో కడ్తాల్, ముచ్చర్ల, అన్మాస్‌పల్లి, సాయిరెడ్డిగూడెం, దాసర్లపల్లి గ్రామాల సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, శంకర్, మహేశ్, బాలమ ణి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూష న్, పర్యావరణ సంస్థ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి, హెచ్ఎం లు నాగరత్నం పాల్గొన్నారు.