Uppal MLA | కాప్రా, మార్చి14 : బడ్జెట్ సమావేశాల సెషన్ నుంచి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఈసీఐఎల్ చౌరస్తా వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలు అర్థసత్యాలను ఎత్తిచూపుతున్న జగదీశ్ రెడ్డిని ప్రభుత్వం కుట్రపూరితంగానే సస్పెండ్ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ద్వారా జరిగే తప్పు ఒప్పులను ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ధర్నా నిర్వహిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, జే ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, బద్రుద్దిన్, సాయిజన్ శేఖర్, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, ముత్యం రెడ్డి, బాబు యాదవ్, షేర్ మణెమ్మ, రవీందర్ రావు, బాలరాజు, రామకృష్ణ,భాస్కర్, బాలకృష్ణ,నర్సింగ్ రావు, పిట్టల నరేష్, మధుసూదన్ రెడ్డి, మోహన్ పాల్గొన్నారు.