కులకచర్ల, సెప్టెంబర్ 7 : మండలంలో ఆగ్రో రైతు సేవా కేంద్రాలు నాలుగు ఉండగా అందులో మూడు కులకచర్లలో ఒకటి ము జాహిద్పూర్లో ఉన్నాయి. చౌడాపూర్ మండలంలోని మరికల్లో ఒక రైతు ఆగ్రోసేవా కేంద్రం ఉన్నది. ప్రభుత్వం రైతు ఆగ్రోసేవా కేంద్రాలకు కూడా చాలీచాలని యూరియా సరఫరా చేయడంతో అక్కడి నిర్వాహకు లు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఆదివారం మండల కేంద్రంలోని ఓ రైతు ఆగ్రో సేవా కేంద్రానికి యూరియా రాగా.. అక్కడ రైతులు గంటలపా టు నిరీక్షించి బస్తాలను తీసుకెళ్లారు. గత పదేండ్లలో లేని సమస్య ఇప్పు డేందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలను సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
మండలంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందిపడుతున్నాం. గత వారం రోజులుగా తిరుగుతున్నా ఎరువు దొరకడంలేదు. గత కేసీఆర్ హయాంలో ఎరువు సమృద్ధిగా దొరికింది. ఇప్పుడేమో దాని కోసం పొలాలను వదిలి రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చింది. ఇకనైనా అన్నదాతల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలి
– బిచ్చయ్య, రైతు కులకచర్ల