ఆదిబట్ల, మే 16 : గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆదిబట్ల ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన షర్వాన్ కుమార్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిదిలోని కమ్మగూడలో పాన్‌షాప్ నిర్వహించే వాడు. తాను గత నాలుగు నెలలుగా రాజస్తాన్ నుండి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి వాటిని కూలీలకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన అజిత్ సర్ధార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి గంజాయి గంజాయి చాక్లెట్ల వ్యాపారం చేద్దామని నిర్ణయానికి వచ్చారు.
షర్వాన్ కుమార్ రాజాస్తాన్ నుండి గంజాయి చాక్లెట్లు తీసుకు వచ్చి మరో వ్యక్తి బినోద్ సర్దార్కు ఇస్తే తాను చుట్టు పక్కల నివాసం ఉండే లేబర్‌కు అమ్మడానికి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. తమ ఒప్పందం ప్రకారం బుధవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో 5 డబ్బాలలో 810 గ్రాముల గంజాయి చాక్లెట్లను షర్వాన్ కుమార్ రాజస్తాన్ నుండి తీసుకు వచ్చి నాదర్గుల్ ఇండస్ట్రీయల్ ఏరియా టాటా అడ్వాన్స్ సిస్టమ్ దగ్గర బినోద్ సర్ధార్కు ఇస్తుండగా ఆదిబట్ల పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 810 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.