Childrens Missing | కులకచర్ల, జూలై 5 : ఇద్దరు చిన్నారులు అదృశ్యం అయిన సంఘటన కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ముజాహిద్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలీ గోపి కుమార్తెలు శృతి( 8 ), అనూష (5) శుక్రవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు తల్లిదండ్రులు.. స్థానికంగా గాలింపు చేపట్టారు. కానీ ఆ చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం ఉదయం కులకచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. తప్పిపోయిన చిన్నారులు ఎక్కడ కనిపించినా, ఆచూకీ తెలిసిన ఈ నెంబర్లకు ఫోన్ చేయగలరని తెలిపారు. కులకచర్ల ఎస్ఐ 8712670044, పరిగి సీఐ 8712670040 ఫోన్ చేయాలని అన్నారు.