బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 00:59:01

టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలి: ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలి: ఎమ్మెల్యే

 బండ్లగూడ:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజారిటీని అందించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు.సోమవారం బండ్లగూడ జాగీర్‌ పరిధిలో గండిపేట మండల టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు.   ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజారీతో గెలిపించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్ట భద్రులకు వివరించాలని పేర్కొన్నారు.  గండిపేట మండల పరిధిలో 14 వేల పట్టభద్రులు ఉన్నారని వారందరిని గుర్తించి ఓటరుగా నమోదు చేయాలన్నారు.  కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్‌, నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖయాదగిరి, డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌, రాందాస్‌, గండిపేట టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్‌, నాయకులు ప్రేమ్‌గౌడ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నాగరాజు, సురేశ్‌గౌడ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీరాములు, నిలేశ్‌దూబే, కోఆప్షన్‌ సభ్యులు మాలాకీ రత్నం, జగదీశ్‌,మేకల ప్రవీణ్‌యాదవ్‌,అనంతరెడ్డి,లక్ష్మీబాయి, పాండు, మల్లేశ్‌యాదవ్‌, సాగర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.