అమ్మను బతికించుకోవాలని.. నోటితో ఆక్సిజన్ అందించిన కూతుర్లు
రోనా వైరస్ రక్కసి.. ఎందరినో బలిగొంటున్నది. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తండ్రికి కూతుళ్లను, సంతానానికి తల్లిదండ్రులను దూరం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నది.

కరోనా వైరస్ రక్కసి.. ఎందరినో బలిగొంటున్నది. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తండ్రికి కూతుళ్లను, సంతానానికి తల్లిదండ్రులను దూరం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నది. అయినప్పటికీ తమ వారిని కాపాడుకునేందుకు ఎవ్వరికి తోచిన రీతిలో వారు ఉపాయాలు చేస్తున్నారు. ఆక్సిజన్ కోసం కొందరు ఎండల్లో తిరుగుతుండగా.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం వేలు ఖర్చు చేసేందుకు కూడా మరికొందరు వెనుకాడటం లేదు. ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు.. తమ వారిని బతికించుకోవాలని ఎందరో తపన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు తమ అమ్మను బతికించుకునేందుకు పడిన కష్టాన్ని చూసిన వారంతా చలించిపోతున్నారు.
ఇప్పటికే ఆగ్రాలో భర్త ప్రాణాలను కాపాడటానికి కాపాడుకోవడానికి నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేసిందో మహిళ. అంత చేసినా ఆమె అతడి ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు బహ్రాయిచ్ నుంచి అచ్చం ఇలాంటి కేసు ఒకటి బయటికొచ్చింది.
వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవడానికి సరైన ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తెప్పించామని, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామని గొప్పలు చెప్తున్న.. వాస్తవంలో మాత్రం వేలాది మంది ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ జీవిస్తున్నారు. కరోనా సోకిన తమ తల్లిని బతికించుకోవడానికి బహ్రాయిచ్‌లోని దవాఖానలో ఆక్సిజన్ కరువవడంతో.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఇద్దరు కుమార్తెలు తమ నోటి ద్వారా ఆక్సిజన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆక్సిజన్ కొరత రావడం, ఆక్సిజన్‌ను బయటి నుంచి కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో ఎలాగైనా తల్లిని బతికించుకోవాలని ఆమె కుమార్తెలు ఆరాటపడ్డారు. మెడికల్ కాలేజీ దవాఖానలో కనిపించిన వారినల్లా వేడుకున్నారు. ఆక్సిజన్ ఇచ్చి అమ్మను కాపాడండంటూ అధికారుల కాళ్లపై పడ్డారు. ఇంత చేసిన ఫలితం లేకపోవడంతో.. నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తే బతుకుతుందేమో చూద్దామని అనుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు తల్లి నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతూ పోయారు. వారి పోరాటంలో ఓడిపోయారు. వారి కండ్ల ముందే తల్లి కండ్లు తేలేసింది. ఆక్సిజన్ సమయానికి అందక ఆ అమ్మ చనిపోయింది.
కరోనా వైరస్ సోకినా పర్వాలేదు అమ్మ బతకాలంటూ నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ అందించేందుకు తపన పడిన అమ్మాయిలు తీరును నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ వైరల్ వీడియో మెడికల్ కాలేజీ దవాఖాన దైన్య పరిస్థితిని కూడా స్పష్టం చేస్తున్నది.
#CoronaVirus: इन दिनों पूरा देश ऑक्सीजन की कमी से जूझ रहा है।ऑक्सीजन की कमी से मरने वालों की खबरें लगातार सामने आ रही हैं। बहराइच के एक अस्पताल में कोरोना संक्रमित महिला को जब ऑक्सीजन नहीं मिली तो लाचार बेटी ने मुंह से सांस देने का प्रयास किया। ये वीडियो काफ़ी वायरल हो रहा। pic.twitter.com/cODPxzT64o
— Amit Singh (@Join_AmitSingh) May 2, 2021
ఇవి కూడా చదవండి..
రాజస్థాన్ ఉప ఎన్నిక : రెండింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ గెలుపు
జార్ఖండ్ ఉప ఎన్నిక : మధుపూర్‌లో జేఎంఎం ఆధిక్యం
ఉత్తరాఖండ్ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

