వికారాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులు ఆదుకునే వారు లేక..వ్యవసాయం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూ ప్రసంగాలు చేయడం మినహా వారి ని పాలకులు పట్టించుకోకపోవడంతో అప్పులు తీర్చలేక.. కుటుంబాలను పోషించే మార్గం లేకపోవడంతో చాలామంది తనువు చాలిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయాన్ని బలోపేతం చేసి.. అన్నదాత ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటును అందిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వా త ఎవుసాన్ని నమ్ముకున్న రైతుల ను నట్టేట ముంచుతున్నది.
15 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడం చాలామంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యింది. కేసీఆర్ హయాంలో సీజన్ కు ముందే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించడంతోపాటు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత రైతు భరోసాను అమల్లోకి తీసుకొచ్చినా.. కొద్దిమందికే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయగా ..మిగిలిన రైతులు పంటల సాగు కోసం వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసిన పరిస్థితులున్నాయి.
అదేవిధంగా నకిలీ విత్తనాలతో రైతు లు నష్టపోవడం, సకాలంలో అందని ఎరువు లు, విత్తనాలు.. ఎరువుల కోసం క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా కాగా.. రేవం త్ సర్కార్ వచ్చాక కరెంట్ కోతలు మొదల య్యాయి. ఇతరుల వద్ద అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తే.. ప్రభుత్వం కనీస మద్దతు ధరను చెల్లించకపోవడం..దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అన్నదాతలు అప్పులు చెల్లించే మార్గం లేక పంట పొలాల్లోనే ప్రాణాలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యా యి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసా యం పండుగలా మారితే… ఇప్పుడు దండుగాలా మారిపోయింది. కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు.. ప్రస్తుతం పం టల సాగు కోసం మళ్లీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రేవంత్ సర్కార్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కరెంట్ కోతలు, రైతుభరోసా పెట్టుబడి సాయం అందకపోవడం, పంటలకు మద్దతు రాక రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో ఇప్పటి వరకు 45 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ యజమాని ఆత్మహత్యతో సంబంధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవన్నీ ప్రభు త్వ హత్యలేనని ప్రతిపక్షాల నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
అప్పుల బాధతో నా భర్త బోయిని గోపాల్ ఆత్మహత్య చేసుకు న్నాడు. అప్పటి నుంచి కుటుం బ పోషణ భారమైంది. నాకు ఇద్దరు సంతానం. వారికి చదువు చెప్పించేందుకు ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. నా భర్త పేరున 30 గుంటల భూమి ఉన్నది. దాదాపుగా రూ. మూడు లక్షల వరకు అప్పు ఉన్నది. వాటిని తీర్చే మార్గం కనిపించడం లేదు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకోగా ప్రాసెస్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. రైతు బీమా డబ్బులు తొందరగా వచ్చేలా చూడాలి.
– బోయిని మమత కోటమర్పల్లి, మర్పల్లి
కులకచర్ల, మార్చి 7 : భర్త మృతితో బతుకు భారంగా మారిందని వీరాపూర్ గ్రామానికి చెందిన రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో వీరాపూర్ గ్రామానికి చెందిన రెబ్బనమోని శ్రీనయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబాన్ని పోషించలేక తన భర్త తనువు చాలించాడని.. అప్పటి నుంచి కుటుంబ భారం తనపై పడిందన్నారు. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నానని చెప్పింది. తమకు మూడు ఎకరాల పొలం ఉన్నదని.. అందులో కొంత పట్టా, లావణి ఉన్నదని.. ఇంకా అప్పులు రూ. ఐదు లక్షల వరకు ఉన్నాయని.. వాటిని తీర్చడం కష్టసాధ్యంగా మారిందని కన్నీరు పెట్టుకున్నది.
వికారాబాద్, మార్చి 7 : వికారాబాద్ పట్టణంలోని మద్గుల్ చిట్ట్టెంపల్లికి చెందిన కుమ్మరిపల్లి జంగయ్య(50), మాణెమ్మలకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఇద్దరివి వివాహాలు కాగా.. చిన్న కూతురు పావని ఉన్నది. కాగా జం గయ్య, మాణెమ్మలు వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. వారికి నాలుగు ఎకరాల భూమి ఉన్నది. అం దులో రెండు ఎకరాల పట్టా భూమి ఉండగా మరో రెండు ఎకరాల పొలం వారి పేరు నుంచి మిస్సైంది. ఈ విషయమై జంగయ్య తీవ్ర మనోవేదనకు గురై 23 మార్చి 20 24లో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతితో కుటుంబం కష్టాల్లో కురుకుపోయింది. ఇంటర్ పూర్తి చేసిన చిన్న కుమార్తె ఉన్నత విద్యాభ్యాసం చేయలేక ఇంట్లోనే ఉంటున్నది. మాణెమ్మ కూలీ పనులు చేస్తూ పోషిస్తున్నది. ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరింది. అందులోని ఓ దూలం విరిగి కూలేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దోమ, మార్చి 7 : మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి యాదయ్య (35) అప్పుల బాధ భరించలేక ఫిబ్రవరి 19, 2025న తన పొలంలో ఉన్న చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్యకు భార్య అంజమ్మ, కుమార్తె సంతోష, కుమారుడు అరవింద్‌తో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని జీవిద్దామని రూ. రెండు లక్ష ల వరకు అప్పులు చేసి బోరుబావులు తవ్వించాడు. అంతేకాకుండా ఓ బ్యాంకు నుంచి రుణాన్ని కూడా తీసుకున్నాడు.వాటిని తీర్చేమార్గం లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అంజమ్మ తెలిపింది. అతడు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని.. వృద్ధులైన అత్తామామలకు మందులు తీసుకొచ్చేందుకు కూడా డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేసింది. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాయని.. అప్పు లు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని కన్నీరు మున్నీరైంది. రైతుబీమాకు అవసరమైన పత్రాలను అధికారులకు ఇచ్చినా.. ఇప్పటివరకు రాలేదన్నారు. అధికారులు స్పందించి త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డ అయినాపూర్ గ్రామానికి చెందిన బేగరి యాదయ్యకు రైతుబీమా ఇంకా క్లయిమ్ కాలేదని దోమ మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావును సంప్రదించగా..ఎల్ఐసీ అధికారులు ఇంకా సమాచారం కావాలని అడిగారని.. ఈ విషయమై వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. వారు పూర్తి వివరాలు పంపించగానే త్వరలోనే క్లయిమ్ అవుతుందన్నారు.
యాలాల, మార్చి 7 : మండలంలోని కమాల్‌పూర్ గ్రామానికి చెందిన గోరేపల్లి శేఖరప్ప అప్పుల బాధ భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. అతడికి భార్య నర్సమ్మ, ఇద్దరు కొడుకులు ఆనంద్, అరవింద్ ఉన్నారు. తన భర్త మూడు నెలల కిందట మృతి చెందడంతో కుటుంబ భారం మొత్తం తనపైనే పడిందని.. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నట్లు వివరించిం ది. నా భర్త పేరున ఎకరం, నా పేరున 19 గుంటలు భూమి ఉన్నదన్నారు. శేఖరప్ప మృతి చెందిదే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. రైతుబీమా వస్తదని చెప్పారు. భర్తతో మృతితో అనాథలమ య్యామని.. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.