రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అలాగే, రేషన్ డీలర్లకూ నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని.. ప్రస్తుతమిస్తున్న కమీషన్‌ను పెం చుతామని, హెల్త్ కార్డులిస్తామని నమ్మి ంచింది. తీరా పవర్లోకి వచ్చి 21 నెలలు దాటినా వాటి ఊసే ఎత్తడంలేదు. తమ సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది.
ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటినా తమను పట్టించుకోవడంలేదని, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్ బకాయిలతోపాటు పదేండ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కాగా జిల్లాలో 936 రేషన్ షాపులున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కార్డు హోల్డర్లకు రావల్సిన బియ్యాన్ని సకాలంలో తీసుకొచ్చి అందిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. జిల్లాలో 936 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారు. వీరంతా పార్ట్‌టైం కాకుండా నెలంతా రేషన్ షాపుల్లోనే ఉంటూ ప్రజలకు బియ్యం, ఇతర నిత్యవసరాలను పంపిణీ చేస్తున్నారు. అయినా డీలర్లకు మాత్రం ఎలాంటి ఆదాయం రావడంలేదు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతినెల రూ. ఐదువేల చొప్పున గౌరవ వేతనం, కమీషన్, హెల్త్‌కార్డులు, రేషన్ షాపుల అద్దె ఇవ్వాలి. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపడుతాం.
– లక్ష్మీనారాయణ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు