కడ్తాల్, ఏప్రిల్ 2 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించనున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. ముద్విన్ గ్రామంలో రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి నిర్మించిన ఇంటిని, చరికొండ గ్రామ పంచాయతీలోని బోయిన్‌గుట్ట తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని జైపాల్‌యాదవ్ తెలిపారు.
ఈమేరకు బుధవారం మధ్యాహ్నం హరీశ్‌రావు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ప్రారంభోత్సవాల అనంతరం బోయిన్‌గుట్టలో తండాలో నిర్వహించనున్న సభలో హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్, కడ్తాల్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ శివ, నాయకులు అంజినాయక్, భీక్యానాయక్, మహేశ్ ఉన్నారు.