షాబాద్, మార్చి 31 : చేవెళ్లలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విసృత్తస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మె ల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరుగనున్న ఈ మీటింగ్‌కు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి.
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గాంధీ, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. సెగ్మెంట్లోని ఐదు మం డలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.