తాండూరు, జూలై 3 : గత నెల రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో వానకాలంలో కంది, పత్తి పంటలు విత్తుకున్న రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు వాహనాల్లో ట్యాంకులు పెట్టి పైపుల ద్వారా నీరు అందిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో దాదా పు రెండు లక్షల ఎకరాల మెట్ట భూములుండగా అందులో 90 శాతం రైతులు పంటలు విత్తుకున్నారు.
పైర్లు మొలక దశలోనే ఎండిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో అసలు మొక్కలే మొలవడం లేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో యాలాల మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన అచ్చయ్య అనే రైతు తాను సాగు చేసిన పత్తి పంటను రక్షించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి వాహనం లో ట్యాంకు పెట్టి పైపు ద్వారా పత్తి మొక్కలకు అం దిస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పంటకు నీరు అందించినట్టు చెప్పారు. నియోజకవర్గంలో పలు గ్రా మాల్లోనూ ప్రధాన పం టల పరిస్థితి ఇలాగే ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.