Shadnagar | షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 19 : నిన్న ట్రాక్టర్ బ్యాటరీలు.. నేడు మోటార్ వైర్లు.. ఇలా వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతున్నారు. విలువైన బ్యాటరీలు, మైటార్ వైర్లను దొంగిలించడంతో.. రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది.
వెలిజర్ల గ్రామస్తుల కథనం మేరకు.. ఈ నెల 15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్, మరో రైతుకు చెందిన ట్రాక్టరు బ్యాటరీలను దొంగలించారు. అదేవిధంగా శుక్రవారం రాత్రి శ్రీశైలం, కర్ణం వెంకటయ్య రైతుల పొలాల్లోని మోటర్లకు సంబంధించిన వైర్లను అపహరించారు. వరుస దొంగతనాలతో రైతులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిఘా వ్యవస్థను పెంచాలంటూ పోలీసులను కోరారు.