సాయం.. సంబురం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు.
- కొనసాగుతున్న రైతుబంధు పంపిణీ
- శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమైన డబ్బులు
- రంగారెడ్డి జిల్లాలో 2,69,797 మందికి 188.54 కోట్లు అందజేత
- వికారాబాద్ జిల్లాలో 2,15,508 మందికి రూ.176.61 కోట్లు..
- డ్రా చేసుకొని పంటల సాగుకు వినియోగిస్తున్న అన్నదాతలు
- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెల్లువెత్తుతున్న కృతజ్ఞతలు
- నాలుగో రోజు రూ.45.44 కోట్లు రైతుబంధు జమ
రైతు బంధు సాయం పంపిణీ కొనసాగుతుండగా.. రైతులు పంటల సాగు పనులు సంబురంగా చేసుకుంటున్నారు. శుక్రవారం నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 2,69,797 మంది రైతులకు రూ.118.54 కోట్లు అందించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,15,508 మందికి రూ.176.61కోట్లు అందాయి. కాగా, రైతులు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం ఖర్చుపెడుతున్నారు. సకాలంలో లాగోడి అందించి అప్పు చేసే బాధలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం ప్రభుత్వం నాలుగెకరాల్లోపు వారికి రైతుబంధు డబ్బులు జమ చేసింది. జిల్లాలో నాలుగెకరాల్లోపు ఉన్న 26,701 మంది రైతులకు రూ.45,44,58,868 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,15,508 మంది రైతులకు రూ.176,61,14,492 జమ చేసింది. వానకాలం సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ.20 వేలు జమ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. వ్యవసాయ అధికారులు కంది విత్తనాలను ఉచితంగా అందజేస్తుండటంతో రెట్టింపు ఆనందంతో సాగు పనుల్లో బిజీ అయ్యారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

