సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 01:01:19

ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి భరత్‌గౌడ్‌  ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో మంత్రితో సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా నష్టపోయినందున పాఠశాల భవనాలకు సంబంధించి ప్రాపర్టీ టాక్స్‌, బస్‌ల టాక్స్‌ను, ఇన్సూరెన్స్‌ను పాఠశాలలు తెరిచేవరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు పాఠశాలల క్యాలెండర్‌ను విడుదల చేయాలని తెలిపారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని నారాయణరెడ్డి తెలిపారు. పాఠశాల కమిషనర్‌ దేవసేనకు సమస్యలను పరిశీలించాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. మంత్రిని కలిసినవారిలో కోశాధికారి మహేందర్‌రావు, శేఖర్‌రెడ్డి ఉన్నారు.