రంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ)/వికారాబాద్ : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోమవారం లక్కీ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు మద్యం షాపుల కేటాయింపు సజావుగా సాగింది. కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్‌నగర్ యూనిట్ పరిధిలో నిర్వహించిన లక్కీ డ్రాకు ముఖ్య అతిథిగా హాజరుకాగా.. శంషాబాద్ యూనిట్‌లోని షాపుల కేటాయింపునకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వెళ్లి లాటరీ విధానంలో దరఖాస్తుదారులకు షాపులను కేటాయించారు. దీంతో దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
కాగా జిల్లాలోని 249 మద్యం షాపులకు 16,381 దరఖాస్తులొచ్చాయి. మద్యం షాపులను లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, సరూర్‌నగర్ యూనిట్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. అలా గే, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో 59 మద్యం షాపులను లాటరీ విధానంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ దరఖాస్తు దారులకు కేటాయించారు. జిల్లాలోని 59 వైన్స్ షాపులకు 1808 మంది టెండర్లు వేశా రు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదన పు ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, ఆబ్కారీ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
