కొడంగల్ : ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను లారీ ఢీకొని బోల్తా పడిన సంఘటన మండలంలోని చిన్ననందిగామ టోల్గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చిన్ననందిగామ స్టేజీ సమీపంలో నిర్మాణంలో ఉన్న టోల్గేట్ వద్ద సిమెంట్ ట్యాంకర్ ఆగి ఉంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు వెళుతున్న గూడ్స్ లారీ ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టి బోల్తా పడింది. కాగా అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ బోల్తా పడ్డ లారీని ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో వాహనాల్లో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరుగకుండ స్వల్ప గాయాలతో బయటపబడ్డారు. పెను ప్రమాదం తప్పిందని వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.